BREAKING
పోలింగ్ అధికారులకు శిక్షణ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి.. తహసీల్దార్‌కు భారతీయ కిసాన్‌ సంఘ్‌ వినతి జ్యోతిష్యం లో డాక్టరేట్ సాధించిన ఆర్.సి.పురం వాసి జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్యవైశ్యులకు దక్కేనా ? 11వ డివిజన్‌లో కొండ గీతికకు మద్దతుగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రచారం నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో ద్విచక్ర వాహనం చోరీ ఘటనపై కేసు నమోదు .. ఎస్ఐ వెంకటరెడ్డి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సంచలన మార్పు.. సైమ్ అయూబ్‌పై వేటు, సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు చోటు అర్నాబ్ తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు టి20 కెప్టెన్సీ.. అజిత్ అగార్కర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణమన్న మాజీ సెలెక్టర్ ఈనెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు • సీనియర్ జర్నలిస్టులకు సన్మానం చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో ముందుండాలి ఓటర్ల జాబితా సిద్ధం - పరిశీలన కొరకు ప్రదర్శన కమిషనర్ ఏసుబాబు వరిగుంతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉపేందర్ నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి * ఎమ్మెల్సీ సురేష్ బాబు * విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్

విద్యార్థి దశ దేశభక్తికి బంగారు బాట, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక

Select Suryaa Now
విద్యార్థి దశ దేశభక్తికి బంగారు బాట, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక

విద్యార్తి దశ దేశ భవిష్యత్తుకు బంగారు బాట లాంటిదని జీవితంలో గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యార్థులు చదువుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ  ఆధ్వర్యంలో సోమవారం  పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ ఏ పాన్ ఇండియా స్కూల్ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై న్యాయమూర్తి మాట్లాడుతూ సురక్షిత్ బచ్‌పన్ అభియాన్  భారతదేశంలో పిల్లల రక్షణ, హక్కులు , వారి భద్రతను పెంపొందించడం కోసం ఉద్దేశించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం అని తెలిపారు.
దేశవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా , బలవంతపు బాల కార్మిక వ్యవస్థను అరికట్టడం,
చిన్న పిల్లలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులను అడ్డుకోవడం, పోక్సోచట్టం పై పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడమని తెలిపారు. ప్రతి బిడ్డకు స్వేచ్ఛగా చదువుకునే, ఆడుకునే సురక్షితమైన వాతావరణాన్ని అందించడం, పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్  గురించి వివరిస్తారను, చైల్డ్‌ హెల్ప్ లైన్ 1098 పిల్లల అత్యవసర రక్షణ కోసం ఉపయోగించుకోవాలి అన్నారు.  ప్రతి ఒక్కరు చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలి అన్నారు.  ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం వల్ల సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టవచ్చని అన్నారు.  

పి. వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్