BREAKING
ప్రతి మహిళా సంఘ సభ్యురాలి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలి నీటి బకెట్‌లో తల మునిగి మహిళ మృతి క్యూబా పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ యువతకు ఎంఎస్ ధోనీ కీలక సందేశం.. ముప్పై ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న మిస్టర్ కూల్ *సంగారెడ్డి పట్టణం లోని గురునానక్ మందిర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగ్గారెడ్డి భూముల పునఃసర్వేపై గ్రామసభ ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్! *సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే* తాత, తండ్రి వారసత్వం పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ 53 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్యం.. ఆ అలవాట్లతోనే నిత్యం యంగ్ లుక్ ఆత్మకూరులో మరో కీలకనేత వైసీపీ కి గుడ్ బై కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఓటేసి ఆశీర్వదించండి. అండగా ఉంటాం జలదంకి లో టిడిపి ఇంటింటి ప్రచారం

ప్రజల ప్రాణాల కోసం పోరాడిన చేతులు.. నేడు న్యాయం కోసం నినదిస్తున్నాయి.కోవిడ్ సేవలు మరువొద్దు.. NHM ఉద్యోగులకు న్యాయం చేయాలి. డా. బాలకృష్ణ_

Select Suryaa Now
ప్రజల ప్రాణాల కోసం పోరాడిన చేతులు.. నేడు న్యాయం కోసం నినదిస్తున్నాయి.కోవిడ్ సేవలు మరువొద్దు.. NHM ఉద్యోగులకు న్యాయం చేయాలి. డా. బాలకృష్ణ_

నాగర్‌కర్నూల్ జిల్లా లో ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో   కొనసాగుతున్న నిరవధిక సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజారోగ్య సేవలందించిన NHM ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని JAC నాయకులు డిమాండ్ చేశారు. కరోనా ప్రారంభ దశలో PPE కిట్లు, మాస్కులు, గ్లౌజుల కొరత వంటి ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగులు ఇంటింటి ఫీవర్ సర్వేలు, కరోనా లక్షణాల గుర్తింపు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఇతర ప్రజారోగ్య సేవలను అంకితభావంతో నిర్వహించారని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేశారని గుర్తుచేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డా. బాలకృష్ణ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో NHM ఉద్యోగులు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాల కోసం పనిచేసిన ఉద్యోగులు నేడు తమ హక్కుల కోసం పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో NHM JAC ప్రతినిధులు హైమవతి, డా. రామకృష్ణ, డా. రాజు, డా. మహతి, చంద్రకళ, రజియా తదితరులు పాల్గొన్నారు.

 పి. వినయ్ కమార్,  నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్