BREAKING
ఘనంగా మహర్షి వాల్మీఖి జయంతి జలదంకి మండలం కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డికి బోయిలచిరువెళ్ల నాయకుల మద్దతు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం నవంబర్ 16 వరకు సాధారణ ఫీజు చెల్లింపునకు అవకాశం: జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ అయోధ్యలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్మాణానికి భూమి పూజ తాత, తండ్రి వారసత్వం - ఆత్మకూరు అభివృద్ధిలక్ష్యం - తల్లితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన యువ నేత తారక్ రెడ్డి దోశలు వేస్తూ ప్రజలతో మమేకమైన తెదేపా అభ్యర్థులు. ఉత్సాహంగా విక్రమసింహపురి వర్సిటీ కావలి జోన్ క్రికెట్ టోర్నీ సూపర్‌స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' మూవీలోకి లేడీ సూపర్‌స్టార్ నయనతార ఎంట్రీ.. ఆసక్తికరమైన పోస్టర్ విడుదల ప్రజల ప్రాణాల కోసం పోరాడిన చేతులు.. నేడు న్యాయం కోసం నినదిస్తున్నాయి.కోవిడ్ సేవలు మరువొద్దు.. NHM ఉద్యోగులకు న్యాయం చేయాలి. డా. బాలకృష్ణ_ ఇంకొల్లులో 11 నామినేషన్లు ఉపసంహరణ వైభవంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు రాహుల్ విజయ్ 'అ' (AH) సినిమా విడుదల తేదీ మార్పు.. నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్ ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా విశ్రాంత జడ్జి నేరెళ్ల శ్రీనివాసరావు శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Select Suryaa Now
తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

 

*అమరావతి, మేజర న్యూస్ :* బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ నేప‌థ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సీఎం వర్చువల్‌గా సమీక్షించారు. రేపటి కల్లా తీవ్ర తుఫానుగా మారి ఇది రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికల రీత్యా ఆయా తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28వ తేదీన ఆర్నబ్ తీవ్ర తుఫాను బాపట్ల-విశాఖ మధ్య యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుఫాను కారణంగా రేపు మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం  ఉందని తెలిపారు. అలాగే తీరప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సీఎంకు తెలియచేశారు. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పలనాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 28,29 తేదీల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. అర్నబ్ తుఫాన్ విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

*షెల్టర్లకు లోతట్టు ప్రాంతాల ప్రజలు*

తుఫాను ప్రభావం నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తుఫాను షెల్టర్లకు తరలించాలని సీఎం నిర్దే్శించారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, శిశువులకు తొలి ప్రాధాన్యతనిచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,711 మంది గర్భిణీలను ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, ఆస్పత్రులకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.  ప్రభావిత జిల్లాల్లోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య బృందాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 7 ఎన్డీఆర్ఎఫ్ 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను 11 ప్రభావిత జిల్లాల్లో మొహరించాలని సీఎం సూచించారు. ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్లో అదనపు బలగాలను రిజర్వ్‌లో ఉంచాన్నారు. మెరైన్ పోలీసులతో పాటు నౌకాదళంతోపాటు కోస్టుగార్డుల సేవలను ఈ తుఫాన్ సహయక చర్యల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం నిర్దేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ సురక్షితంగా తీరప్రాంతానికి తిరిగి రప్పించామని అధికారులు వివరించారు. మొత్తం 30,043 పడవలు సురక్షితంగా హార్బర్‌లకు చేరుకున్నాయని తెలిపారు. తుఫాను బలహీన పడి సముద్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు.

*పంటనష్టం వాటిల్లకుండా చర్యలు*

కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి  వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి నిర్దేశించారు. దాదాపు 1.82 లక్షల హెక్టార్లలోని ఉద్యాన పంటలకు ముప్పు పొంచివున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రేషన్ దుకాణాల్లోనూ సరకులు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం వచ్చిన చోట తక్షణమే పునరుద్ధరించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు తుపాను గమనాన్ని అంచనా వేస్తూ ప్రతీ నాలుగు గంటలకూ ప్రజలకు హెచ్చరికతో కూడిన బులెటిన్ జారీ చేయాలని దిశానిర్దేశం చేశారు. గతంలో వచ్చిన తుఫాన్ల సమాచారాన్ని విశ్లేషిస్తూ రైతులకు, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలని సూచించారు. అలాగే ఆర్నబ్ తుఫాను కారణంగా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  మొత్తం 22 రిజర్వాయర్ల పరిధిలో వరద ప్రవాహాలు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రవాహాలతో 10-12 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాండవ, రైవాడ, యేలేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ, తాడిపూడి రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీటి నిల్వలు వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. వాగులు, వంకలు, కాలువల ప్రవాహాలకు అడ్డంకి లేకుండా చూడాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తుఫాను ప్రభావంపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇక తుఫాన్ ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో చూసి... ఆ మేరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం సూచించారు. ప్రతి తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి గంట గంటకూ అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణ సహా వివిధ శాఖల అధికారులు, మంత్రి రామానాయుడు వర్చువల్‌గా హాజరయ్యారు.