వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి,పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాహిత్య రంగాలకు వాల్మీకి మహర్షి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన రచించిన రామాయణం ధర్మం, నీతి, మానవతా విలువలు, ఆదర్శవంతమైన జీవన విధానాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. మహర్షుల గొప్ప ఆలోచనలు, వారు చూపిన మార్గం తరతరాలకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు.వాల్మీకి మహర్షి జీవితం, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని, ఆయన బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి, బోయ సామాజిక వర్గాల నాయకులు, మండల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాజ శరత్ కుమార్ సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా