BREAKING
కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్

పాడి పశువుల పెంపకంపై శిక్షణ -పంచసూత్ర ప్రణాళికతో డైరీ యూనిట్ లాభదాయకం : విసి వి.వైకుంఠ రావు

Select Suryaa Now
పాడి పశువుల పెంపకంపై శిక్షణ -పంచసూత్ర ప్రణాళికతో డైరీ యూనిట్ లాభదాయకం : విసి వి.వైకుంఠ రావు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ కంటిన్యూఇంగ్ వెటర్నరీ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్  ఆధ్వర్యంలో ఐదు రోజులు శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. విస్తరణ సంచాలకులు డాక్టర్ బి శోభామణి అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ డాక్టర్ బి వైకుంఠరావు హాజరై శిక్షణా తరగతులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ పద్దతులలో పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తులతో ఉపాధి అవకాశం అను అంశం పైన నిరుద్యోగ, ఉద్యోగ యువత ఔత్సహిక రైతులకు సర్టిఫైడ్ పెయిడ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్ డెవలప్‌మెంట్  ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాడి రైతులు పంచసూత్ర ప్రణాళిక (మేలైన జాతి ఎంపిక, యాజమాన్య మెళకువలు, పోషణ, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పత్తి) పాటిస్తే డైరీ యూనిట్ లాభదాయకంగా ఉంటుందన్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ బి శోభామణి యువత వ్యవసాయం వైపు ముగ్గు చూపడం శుభ పరిణామం తెలిపారు. ప్రతి ఒక్కరూ కల్తీ లేని పాలను ఉత్పత్తి చేసి సమాజానికి అందించాలని కోరారు. ప్రొఫెసర్ కె.సుజాత పాల్గొని ఐదు రోజుల శిక్షణ కలంలో నేర్చుకునే వివిధ అంశాల గురించి సీసీవీసీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ రెడ్డి వరప్రసాద్, డాక్టర్ జి గంగరాజు, అసోసిద్దీన్ డాక్టర్ రాణి, డాక్టర్ పి మంజరి, ఏపీ తెలంగాణ నుంచి 72 మంది ఔత్సాహకులు పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్