BREAKING
జడ్పిటిసి ఎంపిక ఉత్కంఠ కు తెర. ఆర్నబ్ తుఫాన్‌.. వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి.. మండలంలో ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవం దేశవాళీ క్రికెట్‌పై భువనేశ్వర్ కుమార్ కీలక ప్రకటన.. ఆ టోర్నీలపైనే పూర్తి ఫోకస్ సరుబుజ్జిలి జడ్పిటిసి అభ్యర్థిగా సింగుపురపు దివ్య రోడ్డు ప్రమాదంలో ఏ ఎస్ ఓ మృతి ఏడుపాయల మంజీరా నదిలో తల్లి, ఇద్దరు కుమార్తెల కోసం గాలింపు: గెలిచిన నెలలో సమస్యలు పరిష్కరిస్తాను -చింతల చేను ప్రచారంలో రాజారెడ్డి హామీ రైలు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి ఆర్నాబ్' తుఫాన్ బీభత్సం పూతలపట్టులో 13 ఎంపీటీసీ స్థానాలలో 8 ఏకగ్రీవం, 5 స్థానాలకు పోలింగ్ ఓటరు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ కార్యాచరణ -"ఓట్ బచావో–దేశ్ బచావో "పై కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సమీక్ష కూటమిలో ఎవరికి వారే! రంజీ ట్రోఫీలో సరాన్ష్ జైన్ రికార్డు బౌలింగ్.. బిహార్‌పై మధ్యప్రదేశ్ ఘన విజయం

రామాయణం మానవాళికి ధర్మం, సత్యం, నీతి మార్గాలను బోధించే మహాకావ్యం – జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

Select Suryaa Now
రామాయణం మానవాళికి ధర్మం, సత్యం, నీతి మార్గాలను బోధించే మహాకావ్యం – జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నీతి, ధర్మం, సత్యం, కరుణ వంటి ఉన్నతమైన విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహాకావ్యం రామాయణమని, ఆ మహాకావ్యాన్ని అందించిన ఆదికవి మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.  సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్ ఆర్ శంకరన్ వీసీ హాలులో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రామాయణం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదని, మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే ధర్మబోధనల సమాహారమని అన్నారు. కుటుంబ సంబంధాలు, సమాజంలో మానవీయ విలువలు, సత్యనిష్ఠ, కర్తవ్యపాలన, కరుణ వంటి ఆదర్శాలను రామాయణం ద్వారా మహర్షి వాల్మీకి ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం తరతరాలకు స్ఫూర్తినిస్తూ, సమాజానికి నైతిక మార్గదర్శకత్వం వహిస్తోందని తెలిపారు.  మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, జీవితంలో మార్పు సాధించడం ద్వారా ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవచ్చనే సందేశాన్ని ఆయన జీవన ప్రస్థానం అందిస్తుందని కలెక్టర్ అన్నారు. వాల్మీకి మహర్షి బోధించిన సత్యం, ధర్మం, మానవీయ విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.