నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి..
నరసన్నపేట, అక్టోబర్ 27 మేజర్ న్యూస్: నరసన్నపేట, పోలాకి మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు మంగళవారం వెల్లడించారునరసన్నపేటలో 49 మంది బరిలో..నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల అధికారి అనురాధ తెలిపారు. మండలంలో టీడీపీ తరఫున 22 మంది, వైఎస్సార్‌సీపీ తరఫున 22 మంది, జనసేన పార్టీ నుంచి ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు కలిపి మొత్తం 49 మంది పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల బీ-ఫారాలను స్వీకరించి సంబంధిత పత్రాలను జత చేసినట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికల పోటీపై స్పష్టత వచ్చిందన్నారు పోలాకిలో 45 మంది అభ్యర్థులు..పోలాకి మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 92 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఉపసంహరణ అనంతరం 45 మంది అభ్యర్థులు పోటీలో మిగిలినట్లు ఎన్నికల అధికారి ఎల్.వి. మధు తెలిపారు. ఇందులో టీడీపీ నుంచి 18 మంది, వైఎస్సార్‌సీపీ నుంచి 19 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులుగా నలుగురు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. సూర్యప్రకాష్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.