BREAKING
ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు నాటో కూటమిలో యూరప్ పేట్రియాట్ క్షిపణి నిర్వహణ కేంద్రానికి ఆతిథ్యం స్పానిష్ ప్రభుత్వానికి సెయుటా సరిహద్దు అల్లర్ల గోప్యతా దస్తావేజుల బహిర్గతానికి ఆదేశం అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన సూర్య ఎఫెక్ట్‌.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్‌

ఆర్నబ్ తుఫాన్‌.. వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
ఆర్నబ్ తుఫాన్‌.. వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కోటబొమ్మాళి అక్టోబర్ 27, మేజర్ న్యూస్:  ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరే అవకాశమున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులతో పాటు రైతులు, పంటలు, పశుసంపదకు నష్టం వాటిల్లకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. మంత్రి మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమీక్షించారు.  గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయక బృందాలు, సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.
వంశధార, నాగావళి నదుల పరివాహక ప్రాంతాల్లో 28, 29 తేదీల్లో ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరే అవకాశముందని కేంద్ర జలసంఘం, నీటిపారుదల శాఖ నివేదికలు సూచిస్తున్న నేపథ్యంలో నిరంతరం నీటిమట్టాలను పర్యవేక్షిస్తూ ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నాగావళి నది పరిధిలోని 53 గ్రామాల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా వంశధార నది పరిధిలోని నరసన్నపేట, జలుమూరు, పొలాకి, కొత్తూరు, గార తదితర ప్రాంతాల్లోని సుమారు 114 గ్రామాల ప్రజలు వరద పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం  చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రైతులు, పంటలు, పశుసంపద రక్షణకు ప్రత్యేక చర్యలు

తుఫాన్, వరదల కారణంగా రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, ఉద్యానవన శాఖలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పశువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, పశుగ్రాసం, మందులు, పశువైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు చేపలు, రొయ్యల చెరువుల గట్లను పరిశీలించి ఆక్వా రైతులను అప్రమత్తం చేయాలన్నారు.విద్యుత్, వైద్య, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలి తుఫాన్ సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యవసర వైద్య సేవలు, మందులు, వైద్య బృందాలు అందుబాటులో ఉండాలని, నీటిపారుదల శాఖ అధికారులు నదులు, కాలువలు, చెరువుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదకర రహదారులు, వంతెనలు, వాగుల వద్ద అవసరమైన భద్రతా చర్యలు చేపట్టి పరిస్థితులకు అనుగుణంగా రాకపోకలను నియంత్రించాలన్నారు. తుఫాన్ తీవ్రత ఉన్న సమయంలో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. తుఫాన్, వరదల ప్రభావం తగ్గిన వెంటనే గ్రామాలవారీగా పంటలు, ఆస్తుల నష్టాన్ని అంచనా వేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.