BREAKING
ఆర్నాబ్' తుఫాన్ బీభత్సం పూతలపట్టులో 13 ఎంపీటీసీ స్థానాలలో 8 ఏకగ్రీవం, 5 స్థానాలకు పోలింగ్ ఓటరు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ కార్యాచరణ -"ఓట్ బచావో–దేశ్ బచావో "పై కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సమీక్ష కూటమిలో ఎవరికి వారే! రంజీ ట్రోఫీలో సరాన్ష్ జైన్ రికార్డు బౌలింగ్.. బిహార్‌పై మధ్యప్రదేశ్ ఘన విజయం రగ్బీ పోటీలలో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ కళ్యాణదుర్గం అభివృద్ధి నా ధ్యేయం - మున్సిపల్ అభ్యర్థి బోయ మౌనిక మురళి. ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కోవాలి క్రీడలతో శారీరక, మానసిక వికాసం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ శెట్టి సుధాకర్ మరియు స్థానిక సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ రాష్ట్రంలో కరువు మండలాల ప్రకటన: తాగునీరు, పశుగ్రాసంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కోనంకి గ్రామంలో హోరెత్తిన జడ్పీటీసీ అభ్యర్థి వునం దీపిక ర్యాలీ - గడపగడపకూ తిరిగి ఓట్ల అభ్యర్థన పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి వునం దీపికఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గ్రామంలో భారీ బైక్ ర్యాలీ, డీజే సౌండ్ల నడుమ కూటమి నాయకులతో కలిసి ప్రచారంలో రంజీ ట్రోఫీలో సంచలనం.. జమ్ముకశ్మీర్‌పై ప్రియాన్షు మోలియా ట్రిపుల్ సెంచరీ తుర్కపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్ సర్పంచ్ పెరుక సరిత- రామచంద్రo ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, షూస్, డైరీలు, డిక్షనరీలను అందజేశారు

కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం - ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Select Suryaa Now
కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం -  ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

సూర్య కామారెడ్డి జిల్లా  ప్రతినిధి : కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ క్రీడాభివృద్ధికి అనువుగా తీర్చిదిద్ది, స్థానిక యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని హైదరాబాద్ హెచ్ సి ఏ  క్రికెట్ అసోసియేషన్  కార్యదర్శి జీవన్ రెడ్డి, హెచ్సీఏ  సీఈఓ ఇంతియాజ్ ఖాన్‌లతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్ పరిశీలించారు.స్టేడియంలోని ప్రస్తుత సౌకర్యాలు, క్రికెట్ ప్రాక్టీస్‌కు అవసరమైన మౌలిక వసతులు, పిచ్ నిర్మాణం, ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించి, క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
 - ప్రవేట్ కోచ్ ల ఏర్పాటుకు కృషి చేస్తాం -హెచ్సీఏ  కార్యదర్శి జీవన్ రెడ్డి 
హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచనల మేరకు కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో వారం రోజుల్లోగా ప్రైవేట్ క్రికెట్ కోచ్‌లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రికెట్ ప్రాక్టీస్ కోసం మూడు నెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన క్రికెట్ సామగ్రిని స్టేడియానికి అందజేస్తామని చెప్పారు..ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి పీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్ రాజా గౌడ్, రెడ్డి నాయక్, భూమని బాలరాజ్, గోనె శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.