ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి - ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి
సూర్య. నేరడి గొండ : ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడం వల్ల పలు గ్రామాల్లో ఇప్పటికే నీటి కొరత ఏర్పడిందని, కాబట్టి ప్రజలందరూ నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగాసాగర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏల్ ని నో ప్రభావంతో వర్షాలు సరిగా కురియకపోవడంతో పలు గ్రామాలలో నీటి కొరత ఏర్పడిందని ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి అన్నారు. వర్షపాతం తగ్గడంతో రాబోయే రోజుల్లో నీటి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. నీటి పొదుపు పై త్వరలోనే మండలంలోని గ్రామాల సర్పంచ్‌లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాలలో ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ నీటి వృథాగా పోకుండా అరికట్టాలని అన్నారు.రాబోయో రోజులలో నీటి కొరత అధికంగా ఏర్పడవచ్చు అని, గ్రామాలలో ప్రజలందరూ భవిష్యత్ అవసరాల కోసం నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎంపీడీవో తెలిపారు.