BREAKING
క్రిస్ బ్రౌన్‌కు ఊరట...యూకే కోర్టులో తప్పిన జైలు శిక్ష, వివాదాస్పద కేసులో తీర్పు లా లీగా క్లాసికో పోరులో రియల్ మాడ్రిడ్ సంచలన విజయం పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యం: ఎంఈఓ బండి గోవిందయ్య. ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా

ఖేత్ బచావో అభియాన్‌లో రైతులకు అవగాహన

Select Suryaa Now
ఖేత్ బచావో అభియాన్‌లో రైతులకు అవగాహన
సూర్య జైనూర్ : సిర్పూర్ (యు) మండలంలో ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు ఏవో ఆనంద్, ఏఈవో శేఖర్ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ, పంటల మార్పిడి, తక్కువ నీటితో పండించే పంటల సాగు ప్రాముఖ్యతను వివరించారు. రైతులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరులను కాపాడుకోవడం ఎంతో అవసరమని అధికారులు తెలిపారు. అధిక నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న వంటి పంటల సాగుపై స్థానిక నీటి లభ్యతను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు శనగ సాగును విస్తృతంగా చేపట్టాలని, జొన్న వంటి చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పంటల మార్పిడి ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని వివరించారు.రైతులు తమ ప్రాంతంలోని నేల స్వభావం, వర్షపాతం, నీటి లభ్యతను పరిశీలించి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయడం వల్ల నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. వ్యవసాయంలో నీటి పొదుపు పద్ధతులను పాటిస్తూ భూగర్భ జలాలను సంరక్షించాలని, భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందించేందుకు ప్రతి రైతు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పిలుపునిచ్చారు. నీటిని కాపాడుకుందాం.. భవిష్యత్ వ్యవసాయాన్ని సంరక్షించుకుందాం అనే సందేశంతో రైతులు ముందుకు సాగాలని కోరారు.