ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్ ;ఆళ్లగడ్డ పట్టణంలో సోమవారం వాల్మీకినంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతివేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నాలుగురోడ్లకూడలి నమీపంలో ఉన్న వాల్మీకిమహర్షి విగ్రహం వద్దకు వాల్మీకులు తరలివచ్చి వూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని వాల్మీకి విగ్రహాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దారు. వస్త్రాలంకరణతో వాల్మీకి విగ్రహాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాల్మీకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకల్లో పాల్గొని వాల్మీకిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం హాజరైన వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం వాల్మీకి సంఘ నాయకులు మాట్లాడుతూ రామాయణ మహాకావ్యాన్ని అందించిన వాల్మీకి నమస్తమానవాళికి ఆదర్శమని కొనియాడారు. వాల్మీకి మహర్షి లాంటి మహానీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని వారిమార్గంలో లక్ష్యాలను సాధించాలని సూచించారు. మహనీయుని జయంతిని జరువుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మానవతా విలువలు, ఆదర్శభావాలను బోధించే రామాయణాన్ని రచించిన వాల్మీకి ప్రపంచానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. అనంతరం హాజరైన వారు వాల్మీకిమహర్షికి పూజలు నిర్వహించగా నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందించారు. మధ్యాహ్నం వాల్మీకులంతా సమావేశమై ఐక్యతతోనే ఏమైనా సాధించగలమని తెలియజేశారు. సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కార్యాలయం నుంచి పాతబస్టాండు, టిబిరోడ్డుమీదుగా నాలుగురోడ్లకూడలివరకు ఊరేగించారు. గ్రామోత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, నేతాజి, రాంపల్లె రామకృష్ణ, పడకండ్ల రవి, కె. శ్రీనివాసులు, బి.నరసింహుడు,మధు, శ్రీధర్,శీలం చిన్న ఓబులేసు సీసీ. మద్దిలేటి, తేజ, నాగేంద్ర, జి. రాఘవ, నాగరాజు, రాంపల్లి వెంకటేశ్వర్లు, సంఘ పెద్దలు రంగనాయకులు, నాగయ్యతదితరులు పాల్గొన్నారు.
కరణం శ్రీనివాసరావు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా