BREAKING
రొంపిచెర్ల జెడ్పీటీసీ పోరు రసవత్తరం… కొమురం భీం  ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి... ఆదివాసీ సంఘాల నాయకులు క్రిస్ బ్రౌన్‌కు ఊరట...యూకే కోర్టులో తప్పిన జైలు శిక్ష, వివాదాస్పద కేసులో తీర్పు లా లీగా క్లాసికో పోరులో రియల్ మాడ్రిడ్ సంచలన విజయం పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యం: ఎంఈఓ బండి గోవిందయ్య. ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు

21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన నాయకుల విస్తృత ప్రచారం!

Select Suryaa Now
21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన నాయకుల విస్తృత ప్రచారం!

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నెల్లూరు నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే సంకల్పంతో, 21వ డివిజన్‌లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి  శ్రీమతి గునుకుల విజయలక్ష్మి   ని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, నెల్లూరు నగర మేయర్‌గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  శ్రీ రూప్ కుమార్ యాదవ్  ని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ చైర్‌పర్సన్  శ్రీమతి తాళ్లపాక అనురాధ , మాజీ జెడ్పీటీసీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు  శ్రీమతి విజయత , 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  శ్రీ సాయి , ముంగమూరు కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న  శ్రీ ముంగమూరు యశ్వంత్ కేవీ రెడ్డి , భాస్కర్ రెడ్డి  , బాలాజీ, మధు, శ్రీనివాసులు  తదితర నాయకులు పాల్గొని ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.

 “పారదర్శకతతో పాలన… జవాబుదారీతనంతో ప్రజాసేవ… అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పు!” 

గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్  ఆశయంగా చూపిన ప్రజా బాధ్యత, పారదర్శకత, సేవాభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే  శ్రీ పొంగూరు నారాయణ సమర్థవంతమైన నాయకత్వానికి మరింత బలాన్ని చేకూర్చాలని నాయకులు ప్రజలను కోరారు.

జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్న ఐక్యతను చాటుతూ, సమన్వయంతో ముందుకు సాగుతున్న కూటమి నాయకులు 21వ డివిజన్‌లో ప్రతి గడపనూ పలకరిస్తూ అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు.

“కూటమి ఐక్యతే విజయానికి పునాది… ప్రజల ఆశీర్వాదమే అభివృద్ధికి చోదకశక్తి!” 

గునుకుల విజయలక్ష్మి గారిని 21వ డివిజన్ కార్పొరేటర్‌గా, శ్రీ రూప్ కుమార్ యాదవ్  ని నెల్లూరు నగర మేయర్‌గా భారీ మెజారిటీతో గెలిపించి, నగర అభివృద్ధికి ప్రజలు తమ సంపూర్ణ మద్దతు అందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా సమష్టిగా కృషి చేస్తున్న తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ,  “ప్రతి అడుగు ప్రజాహితం కోసం… ప్రతి నిర్ణయం అభివృద్ధి కోసం… ప్రతి విజయం ప్రజల కోసం!”  అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని జనసేన పార్టీ సీనియర్ నాయకులు  శ్రీ కిషోర్ గునుకుల  తెలిపారు.