కేటీఆర్‌తో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ
పటాన్‌చెరు:బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ను సోమవారం ఉదయం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాలని కేటీఆర్‌ను జిఎంఆర్ ఆహ్వానించారు. అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కేటీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపారు.