BREAKING
కొమురం భీమ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ బిర్యానీ తినిపించారు.. జ్యూస్ కలపిచ్చారు షరణి మాస్ ప్లాన్‌కి నెల్లూరు షేక్ ఆంధ్ర వైద్య కళాశాలలో పీజీ కోర్స్ లో కొత్త విద్యార్థుల ప్రవేశాలకు శ్రీకారం విద్యార్థి దశ దేశభక్తికి బంగారు బాట, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక కొమురం భీమ్ ఆశయాలను కొనసాగించాలి: నైతం లక్ష్మణ్ వార్డులో మౌళిక సమస్యల పరిష్కారానికి శ్రీకారం కే జి హెచ్ వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు పై వైద్యాధికారులు దృష్టి సారించాలి వత్సవాయి మండలంలో 17 ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ రామాయణం నుంచి అద్భుతమైన ప్రేమకథా గీతం.. రంగులు రంగులే పాట విడుదల ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులు హాజరు కావాలి అక్టోబర్ 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం త్రివిక్రమ్ సినిమాల కంటే ఇది పూర్తిగా భిన్నం: ఆదర్శ కుటుంబంపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు మంగళ ,బుధ,వారాల్లో తుఫాను దృష్ట్యా అన్ని విద్యాసంస్థలకు సెలవులు అర్ణబ్ తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా కోనసీమ జిల్లాకు నెల్లూరు విద్యుత్ సిబ్బంది కాంగ్రెస్ బలోపేతం, జిల్లా అభివృద్ధిపై సమీక్ష విద్యుత్ అభివృద్ధి పనులు, సోలార్ ప్రాజెక్టులపై ఎస్‌ఈ పి. సుధాకర్ క్షేత్రస్థాయి పరిశీలన

మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Select Suryaa Now
మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ధర్మం, మానవతా సూత్రాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంలో నైతిక విలువలు, సమానత్వం, మానవతా భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలు, వారి బోధనలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి. విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి,  (జెడ్పీ సీఈఓ) చందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, సహాయ బీసీ అభివృద్ధి అధికారి  మామిండ్ల చక్రధర్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు  నీల నాగరాజు, ఎంబీసీ నాయకులు శ్రీనివాస్, జనార్ధన్, గణేశ్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.