BREAKING
ఈనెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు • సీనియర్ జర్నలిస్టులకు సన్మానం చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో ముందుండాలి ఓటర్ల జాబితా సిద్ధం - పరిశీలన కొరకు ప్రదర్శన కమిషనర్ ఏసుబాబు వరిగుంతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉపేందర్ నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి * ఎమ్మెల్సీ సురేష్ బాబు * విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వాల్మీకి జయంతి వేడు కాలు ఘనంగా నిర్వహించారు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కీలక పరిణామాలు.. నిక్ మాడిన్సన్ స్వదేశానికి పయనం, స్టీవ్ స్మిత్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత ప్రచారంలో దూసుకు పోతున్న జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి,పందిటి అంబేద్కర్ మాదిగ రజాక్ పల్లి లో 700 ఈత మొక్కల నాటిన ఎక్సైజ్ అధికారులు… కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు- కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఎక్సైజ్ సీఐ గోపాల్ క్రెడాయ్ హోమ్ ఎక్స్‌పోకు భారీ స్పందన ఎండోమెంట్ సహాయ కమిషనర్ ను కలిసిన జిల్లా డి.డి.యన్.అర్చకులు. బాసర ఐఐఐటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం రెండు, మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభం: కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజావాణిలో 5 దరఖాస్తులు

విద్యుత్ అభివృద్ధి పనులు, సోలార్ ప్రాజెక్టులపై ఎస్‌ఈ పి. సుధాకర్ క్షేత్రస్థాయి పరిశీలన

Select Suryaa Now
విద్యుత్ అభివృద్ధి పనులు, సోలార్ ప్రాజెక్టులపై ఎస్‌ఈ పి. సుధాకర్ క్షేత్రస్థాయి పరిశీలన

గూడూరు, మేజర్ న్యూస్ :  నెల్లూరు జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) శ్రీ పి. సుధాకర్ గారు ఈరోజు గూడూరు డివిజన్ పరిధిలో పలు విద్యుత్ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.  చిట్టేడు సబ్‌స్టేషన్‌లో RDSS, PM-KUSUM పనుల పరిశీలన   33/11 కేవీ చిట్టేడు సబ్‌స్టేషన్‌లో RDSS పథకం కింద జరుగుతున్న పనులను, PM-KUSUM పథకానికి సంబంధించిన మీటరింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్‌ను అడిగి విద్యుత్ నిర్వహణ పరిస్థితులు, రికార్డులు, ఇతర సాంకేతిక అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

మద్దాలి గ్రామంలో 12 మెగావాట్ల PM-KUSUM సోలార్ ప్రాజెక్టుపై సమీక్ష

ఫీడర్ లెవల్ సోలరైజేషన్ కార్యక్రమంలో భాగంగా గూడూరు డివిజన్ మద్దాలి గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో మోహన్ స్ప్రింటెక్స్ సంస్థ చేపడుతున్న 12 మెగావాట్ల PM-KUSUM సోలార్ విద్యుత్ ప్లాంట్ పనుల పురోగతిని పరిశీలించారు. పవర్ ఎవాక్యుయేషన్, స్టార్ట్-అప్ పవర్ ఏర్పాట్లు, మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ స్థితి, ప్రాజెక్టు పూర్తయ్యే అంచనా గడువు తదితర అంశాలను సమీక్షించి, పనులను వేగవంతం చేయాలని సూచించారు.

132 కేవీ కడివేడు సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల పరిశీలన  కడివేడు వద్ద నిర్మాణంలో ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్ పనుల పురోగతిని పరిశీలించి, పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ULA సోలార్ ఇన్‌స్టాలేషన్ల నాణ్యత, MNRE పోర్టల్ అప్‌డేట్‌పై సమీక్ష

గూడూరులోని ULA కాంట్రాక్టర్ సరళ ప్రాజెక్ట్స్ కార్యాలయాన్ని సందర్శించి, VLA వ్యవస్థలో సోలార్ ఇన్‌స్టాలేషన్ల వివరాలను నమోదు చేయడం, MNRE పోర్టల్‌లో వివరాలను అప్‌లోడ్ చేసే ప్రక్రియపై సమీక్షించారు. అనంతరం SC/ST విద్యుత్ వినియోగదారుని ఇంటిని సందర్శించి, ULA పథకం కింద ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ పనుల నాణ్యతను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్) శ్రీ అల్తాఫ్, గూడూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ నరేందర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ కోట చిన్నస్వామి నాయక్, శ్రీ పి. చిన్నయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.