ప్రజావాణిలో 5 దరఖాస్తులు
రేగోడు;ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సోమవారం రేగోడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 5 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సంబంధించి 3 దరఖాస్తులు, పంచాయతీరాజ్ శాఖ సంబంధించి ఒక దరఖాస్తు, చరవాణి టవర్ ఏర్పాటు చేయాలని ఒక దరఖాస్తు వచ్చిందని ఈ కార్యక్రమానికి 12 శాఖల అధికారులు హాజరు కావడం జరిగిందని ఎంపీడీవో పేర్కొన్నారు