BREAKING
*నవంబర్ 1 న చలో ఢిల్లీ* మొగళ్లూరులో తోడికోడళ్ల ఎన్నికల పోరు! కుటుంబ బంధాలు ఒకవైపు.. రాజకీయ పోటీ మరోవైపు... వైసిపి కి క్రిస్టియన్ మైనార్టీ పాస్టర్లు మద్దతు *ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* గ్రామ ప్రజల కోరిక మేరకు అయ్యప్ప ఆలయానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ రెండు లక్షల విరాళం ఈవీఎం గోదాముల్లో కలెక్టర్ తనిఖీ రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు 18వ వార్డు అభ్యర్థి కె. లోకేష్ రెడ్డిని గెలిపించాలని నేతల విజ్ఞప్తి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కళాకారుల ఐక్యతే మన బలం విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఏఐటీఏ ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. పోటీకి దూరంగా నిలిచిన లియాండర్ పేస్ నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్

ఎమ్మెల్యే రోషన్..సామాన్యుడిలా! రోడ్డు పక్కన తేగలు కొని.. మహిళతో ముచ్చటించి!

Select Suryaa Now
ఎమ్మెల్యే రోషన్..సామాన్యుడిలా!  రోడ్డు పక్కన తేగలు కొని.. మహిళతో ముచ్చటించి!

జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్ చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ తన నిరాడంబరతను చాటుకున్నారు. జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన, మార్గమధ్యంలో రోడ్డు పక్కన తేగలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళను గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి ఆమె వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె వద్ద తేగలను కొనుగోలు చేశారు.

తన వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించిన వ్యక్తి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అని తెలుసుకున్న ఆ మహిళ ఆశ్చర్యానికి గురైంది. ప్రజాప్రతినిధిగా బిజీగా ఉన్నప్పటికీ, మార్గమధ్యంలో సామాన్య మహిళను పలకరించి ఆమెతో కొద్దిసేపు మాట్లాడటం స్థానికుల దృష్టిని ఆకర్షించింది.

ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యకు వెళ్లి వారి జీవన పరిస్థితులను తెలుసుకోవడం, ఆప్యాయంగా పలకరించడం ప్రజలకు మరింత చేరువయ్యే మార్గమని ఈ సంఘటన గుర్తుచేస్తోంది. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

 రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,