BREAKING
జిల్లా పరిషత్ పాఠశాలకు టేబుల్ బహుకరించిన ఐటీసీ.. షెడ్యూల్‌ కంటే ముందే న్యూజిలాండ్‌కు చేరుకున్న శుభమన్ గిల్.. కఠోర సాధనలో నిమగ్నమైన స్టార్ బ్యాటర్ పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తిరుమల, 2026 అక్టోబర్ 26 తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ కివీస్‌తో మూడో అనధికార టెస్టు బరిలోకి జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్.. టీమిండియాకు భారీ ఊరట అక్రమ ఇసుక నిలువలు సీజ్ బిగ్ బాస్ హౌస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురైన షాలిని.. శివాజీ సంధించిన ప్రశ్నలకు కన్నీటి పర్యంతం 17వ డివిజన్‌లో అజేష్, భవాని విస్తృత ప్రచారం.. కమలం, గాజు గ్లాస్ గుర్తులకు ఓటేయాలని కూటమి నేతల విజ్ఞప్తి ఉద్యోగులకు రక్షణ కల్పించాలి -గత ఎన్నికల్లో సిబ్బందిపై దాడులు ఈసారి పునరావృతం కాకుండా చూడండి -డిఆర్ఓ కు ఏపీ జేఏసీ వినతి కూటమి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటా ప్రచారం పద్మశాలి సంఘం మెదక్ యూత్ అధ్యక్షునిగా పోల నవీన్ కుమార్ నియామకం. పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ - హిమాలయ యోగి సనత్ సదానందగిరి మహారాజ్ తో కలిసి ఆవిష్కరణ - ఆశీర్వాదం, సన్మానం స్వీకరించిన ఎమ్మెల్యే సీతారాంపల్లిలో దొంగల బీభత్సం.. ఆర్నాబ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అవనిగడ్డలో జోరుగా తెలుగుదేశం ప్రచారం ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన జయలక్ష్మి

*ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం*

Select Suryaa Now
*ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం*

నారాయణఖేడ్;నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో పంప్‌హౌస్ వద్ద మిషన్ భగీరథ విభాగానికి చెందిన 3.95 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎన్‌ఏపీ నీటి శుద్ధి కేంద్రం (డబ్ల్యూటీపి) పునరుద్ధరణ పనులు డీఎంఎఫ్‌టీ నిధులు రూ.95 లక్షలతో పూర్తికావడంతో, సోమవారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతపై ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు, ముఖ్యంగా మానూర్ మండల ప్రజలకు తాగునీటి సరఫరాకు అదనపు భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం అందుబాటులో ఉండటం వల్ల రానున్న నెలల్లో నీటి సమస్యను ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు నీటి సరఫరా ఏ మేరకు అందిందో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బోర్లు ఇప్పటికీ అనేక గ్రామాల్లో ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. అలాగే బోరంచ గ్రామ అభివృద్ధికి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. బిరాంచ నల్లపోచమ్మ ఆలయం వద్ద నదీ తీరంలో రూ.2 కోట్లతో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు, సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బోరంచ గ్రామ ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మంజూరు చేయించుకున్నామని, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు తాగునీరు, విద్యుత్ వంటి అత్యవసర సదుపాయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజి రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ యువ నాయకులు లోకేష్ రెడ్డి గ్రామ సర్పంచ్ బీరప్ప కురుమ, ఉప సర్పంచ్ కరీం, దిగంబర్ రెడ్డి, బ్రాహ్మణాoద్ రెడ్డి మాజీ సర్పంచ్లు, సంజీవ్ సర్పంచ్, నవీన్ రెడ్డి, మల్లప్ప ఛైర్మెన్, నరసింహ రెడ్డి జనర్షింలు, శ్రీకాంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, స్మార్ట్ రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.