వైసిపి కి క్రిస్టియన్ మైనార్టీ పాస్టర్లు మద్దతు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం:స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తిలో క్రిస్టియన్ మైనారిటీకి చెందిన పలువురు పాస్టర్లు సోమవారం వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని కలిసి తమ స్వచ్ఛంద మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీకి మద్దతు తెలిపిన పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విఫలమైందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.