నాకు దొరికిన అరుదైన అవకాశం - ఏనుగు గుర్తుకే ఓటేసి గెలిపించండి: బీఎస్పీ చైర్మన్ అభ్యర్థి గొల్ల నాగరాజు
రాయదుర్గం టౌన్, మేజర్ న్యూస్ :* రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో బీఎస్పీ పార్టీ తరపున చైర్మన్ గా నేను పోటీ చేస్తున్నానని బీఎస్పీ చైర్మన్ అభ్యర్థి గొల్ల నాగరాజు తెలిపారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాయదుర్గం చరిత్రలో బీఎస్పీ పార్టీ నుండి ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఒక సాధారణ వ్యక్తిగా నాకు ఈరోజు చైర్మన్ గా పోటీ చేసే అవకాశాన్ని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు గారు కల్పించారన్నారు,ఎప్పుడూ ఎవరికీ దక్కని ఈ అరుదైన అవకాశం ఈరోజు నాకు దొరికిందని, ఇది నా ఒక్కడి అవకాశం కాదని, రాయదుర్గంలోని సామాన్య ప్రజలందరి అవకాశం అని భావిస్తున్నానని తెలిపారు.
రాయదుర్గం ప్రజలందరికీ నమస్కారం నాకు మొదటి బ్యాలెట్ లో ఒకటో నంబర్ లో ఉన్న ఏనుగు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని, ఒక్కసారి అవకాశం ఇస్తే రాయదుర్గం అభివృద్ధికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.