నగరం మండలంలో 10 ఎంపీటీసీ నామినేషన్ ఉపసంహరణ
నగరం, మేజర్ న్యూస్: నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు మండల వ్యాప్తంగా 69 ఎంపీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరఫున 7, వైఎస్సార్సీపి తరఫున 3 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు
ఎన్నికల అధికారి కె. సత్యనారాయణ సోమవారం ప్రకటించారు. అనంతరం 59 మంది పోటీలో ఉన్నారు. ఉపసంహరించుకున్న వారిలో ఏలేటిపాలెం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థులు చిరకాల పద్మజ, కొప్పుల కృష్ణవేణి, కొప్పుల రమ్య జ్యోతి, శివనాగ మల్లేశ్వరి చిరకాల, చిరకాల శ్రావంతి, కొలగానివారిపాలెం సెగ్మెంట్ వైకాపా అభ్యర్థి పమిడిపాముల ఏసమ్మ, పెదపట్లపూడి సెగ్మెంట్ వైకాపా అభ్యర్థి కొప్పోలు వెంకటేశ్వరరావు, నగరం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి యార్లగడ్డ నాగలక్ష్మి తిరుపతమ్మ, పూడివాడ సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి కాసాని సముద్రాల బసవమ్మ, వైకాపా అభ్యర్థి లక్ష్మీ తిరుపతమ్మ ఎనుమల తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో అబిద్ హుస్సేన్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.