BREAKING
జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు విజయ్ దేవరకొండ, రష్మికపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విరోష్ టీమ్ *ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం* వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భూపాలపల్లి లో కాంగ్రెస్ ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమం *ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ* దీపావళి తాత్కాలిక బాణసంచా దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘మిస్సెస్ మామ్’ కార్యక్రమం రాయికోడ్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా పట్లోళ్ల విక్రమ్ రెడ్డి భారత్ ఇప్పుడు మరింత పెద్దదిగా ఆలోచిస్తోంది.. ప్రధాని మోదీ నాయకత్వంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ ప్రశంసలు గొట్టిపాటి చొరవతో అద్దంకిలో ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహం.

బాసర ఐఐఐటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం రెండు, మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభం: కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
బాసర ఐఐఐటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం  రెండు, మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభం: కలెక్టర్ భవేశ్ మిశ్రా

బాసర ఐఐఐటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

రెండు, మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభం: కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్, అక్టోబర్ 26: బాసర ఐఐఐటీలో విద్యార్థులకు నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. సోమవారం ఐఐఐటీని సందర్శించిన ఆయన, గోదావరి వద్ద నీటి సరఫరా ఇంటెక్‌వెల్‌ను, క్యాంపస్‌లోని పంప్‌హౌస్‌, నీటి నిల్వ కుంటను పరిశీలించారు.

ఐఐఐటీకి నీటిని సరఫరా చేసే మూడు మోటార్లలో రెండు మరమ్మతులకు గురయ్యాయని, వాటి మరమ్మతుల కోసం రూ.8 లక్షలు కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. పది రోజుల్లో వాటిని అందుబాటులోకి తీసుకువస్తామని, అవసరమైతే గ్రామపంచాయతీ ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం నీటి లభ్యత సరిపడా ఉందని, సరఫరాలోని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

విద్యార్థులకు రెండు, మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్‌ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటీ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.