ప్రచారంలో దూసుకు పోతున్న జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి,పందిటి అంబేద్కర్ మాదిగ
వింజమూరు మేజర్ న్యూస్ : మహాజన నేత పధ్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆశీస్సులతో సోమవారం వింజమూరు మండలంలోని గండెమడకల.నల్లగొండ్ల, శంఖవరం,నేరేడుపల్లి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేశారు ఈ సందర్బంగా ఎం ఎస్ పి బలపరిచిన జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ మీ ముందుకు వస్తున్నది పదవి కోసంకాదు…ప్రజల కష్టాలను వినడానికి,పేదల కన్నీళ్లను తుడవడానికి, బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలవడానికి
ప్రతి పేద కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు… అండగా ఉంటానని
ఒక సామాన్యుడికి తన సమస్య చెప్పుకోవడానికి ఒక మనిషి కావాల్సినప్పుడు… అలాంటి సమయంలో మీ పక్కన నిలబడాలన్నదే నా ఆకాంక్ష.
రాజకీయాలు అంటే అధికారం మాత్రమే కాదు… ప్రజల బాధ్యతను భుజాలపై వేసుకొని.ప్రజల మధ్య ఉండటం,వారి సమస్యలను తెలుసుకోవడం,సాధ్యమైన పరిష్కారాల కోసం నిరంతరం కృషి చేస్తానని.
మీ నమ్మకాన్ని గౌరవిస్తూ, కమిట్‌మెంట్,క్రమశిక్షణ, నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నానని వింజమూరు మండల అభివృద్ధిలో ప్రతి గ్రామానికి,ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటానని ఆయన అన్నారు వింజమూరు మండల ప్రజలారా . ఆశీర్వాదించి మీ అమూల్యమైన ఓటుతో నిజాయతిని గెలిపించాలని వారు కోరారు ఈ ప్రచారంలో ఆయనపాటు ఎంఎస్పీ మండల ఇన్చార్జీ గోచిపాతల ఆనంద్ రావు,మల్లెల తిరుమలేష్, చెంచల రాకేష్,గంగపట్ల మధన్,వడ్లపల్లి ప్రసాద్,గంగపట్ల రవీంద్ర, గంగపట్ల మురళి,గంగపట్ల తిరుపాలు గ్రామాలలో పెద్దలు యువకులు తదితరులు పోల్గొన్నారు