ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులు హాజరు కావాలి అక్టోబర్ 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం
టి.నరసాపురం, మేజర్ న్యూస్:ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించి అక్టోబర్ 27వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు హాజరుకావచ్చని ఎన్నికల అధికారి టి. గోవిందరాజు తెలిపారు.అభ్యర్థులు స్వయంగా హాజరై నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని, ఒకవేళ అభ్యర్థి అందుబాటులో లేకపోతే నామినేషన్‌లో ప్రతిపాదకుడిగా (ప్రపోజర్‌గా) ఉన్న వ్యక్తి ద్వారా అభ్యర్థి అనుమతి లేఖతోపాటు ఉపసంహరణ పత్రాన్ని అందజేసి ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని వెల్లడించారు.డిపాజిట్ రసీదు తప్పనిసరి:నామినేషన్ దాఖలు సమయంలో చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని వెంటనే తిరిగి అందజేస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. డిపాజిట్ మొత్తాన్ని తిరిగి పొందేందుకు సంబంధిత రసీదును తప్పనిసరిగా తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు,