ఆంధ్ర వైద్య కళాశాలలో పీజీ కోర్స్ లో కొత్త విద్యార్థుల ప్రవేశాలకు శ్రీకారం
విశాఖపట్నం, సూర్య : ఆంధ్ర వైద్య కళాశాలలో పీజీ కోర్సుల విద్యను అభ్యసించేందుకు కొత్త విద్యార్థులకు సోమవారం నుండి అవకాశాలు కల్పిస్తున్నా మని ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి తెలియజేశారు. ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో మెరిట్ సాధించి ప్రవేశాల కోసo అవకాశం కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ వెల్లడించారు. వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో సోమవారం జ్యోత్స్న చేరినట్లు తెలిపారు. 1980 ఇండియన్ ర్యాంకర్ ముత్యాల జోష్న స్త్రీ మరియు గైనిక్ కోర్సులో పీజీ చేసేందుకు పత్రాలు సమర్పించి ప్రవేశం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. పీజీ ప్రవేశాల కోసం మొట్టమొదటిసారి వైద్య విద్యార్థి లు వచ్చి చేరినట్లు తెలియజేశారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.