మంగళ ,బుధ,వారాల్లో తుఫాను దృష్ట్యా అన్ని విద్యాసంస్థలకు సెలవులు
ఏలూరు, : జిల్లాలో అర్నాబ్ తుపాను తీవ్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 27, 28 సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
అందరూ గమనించి, సంబంధిత విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు.