కే జి హెచ్ వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు పై వైద్యాధికారులు దృష్టి సారించాలి
విశాఖపట్నం, సూర్య : కేజీహెచ్ లో వాహనాలు పార్కింగ్ కోసం నిర్దిష్ట ప్రదేశాలను గుర్తించి వివరాలను నోటీసు బాటిల్ ద్వారా ప్రచారం చేయాలని వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ రవికుమార్ సూచించారు. సోమవారం కేజీహెచ్ లో ఫ్యామిలీ ప్లానింగ్, కార్డియాలజీ, మెయిన్ గేట్ అవుట్ గెట్ పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న వాహన పార్కింగ్ వ్యవస్థను తనిఖీ చేశారు. ఆసుపత్రి రహదారుల్లో టూ వీలర్స్ ఆటోలు కార్లు పార్కింగ్ స్థలాల్లో కాకుండా రోడ్డుకి ఇరుపక్కల ఎక్కడ పెడితే అక్కడ పార్కింగ్ చేయడం పట్ల ఆసుపత్రి సెక్యూరిటీ ప్రశ్నించారు. పార్కింగ్ వ్యవస్థ పట్ల వైద్యం కోసం వచ్చే రోగులు, సహాయకులకు మెయిన్ గేట్ అవుట్ గెట్ మార్గాల్లో పార్కింగ్ స్థలాలు వివరాలతో కూడిన సమాచారాన్ని వైద్యాధికారులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పార్కింగ్ స్థలాల్లో బోర్డులు లేకపోవడం పట్ల ఆయన సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించారు. ఆసుపత్రి అధికార వర్గాలు వాహనాలకు పార్కింగ్ స్థలాలు గుర్తించి అక్కడ పార్కింగ్ సదుపాయాలు కల్పించాలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో ప్రవేశించేటప్పుడు వెళ్లే మార్గం వచ్చే మార్గం గుండా ఎక్కడ వాహనాలు ప్రాంగణంలో లేకుండా సెక్యూరిటీ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి పార్కింగ్ పట్ల ముందస్తు అవగాహన కలిగేలా చూడాలన్నారు. వాహనాల దొంగతనాలు నిరోధించే విధంగా వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడతారని వెల్లడించారు. రోగులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇందుకోసం వైద్యాధికారులు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ ఎస్ఐ వెంట జోగారావు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.