telangana
గిరిజన డిగ్రీ కళాశాలలో ఘనంగా కొమురం భీం వర్ధంతి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : తెలంగాణ గిరిజన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు. కొమరం భీం వర్ధంతి సందర్భంగా గిరిజన డిగ్రీ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శివకృష్ణ గారు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని కొమరం భీమ్ చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. కొమురం భీమ్ తెలంగాణ గడ్డపై జన్మించిన గొప్ప గిరిజన విప్లవ వీరుడు. గోండు గిరిజన సమాజానికి చెందిన ఆయన నిజాం పాలనలో గిరిజనులు ఎదుర్కొన్న అన్యాయాలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. గిరిజనుల భూములు. అడవులు సహజ వనరులపై వారికి హక్కులు ఉండాలని ఉద్యమించారు. జల్, జంగిల్, జమీన్ అనే నినాదంతో గిరిజన హక్కుల సాధనకు తన జీవితాన్ని అంకితం చేశారు .1940లో జోడేఘాట్ ప్రాంతంలో నిజాం సైన్యంతో జరిగిన పోరాటంలో కొమురం భీం వీరమరణం పొందారు. ఆయన త్యాగం గిరిజనుల ఆత్మగౌరవానికి, హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచింది. నేటికీ ఆయన జీవితం యువతకు ధైర్యం, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం పట్ల నిబద్దను నేర్పుతోంది.