BREAKING
ప్రతి మహిళా సంఘ సభ్యురాలి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలి నీటి బకెట్‌లో తల మునిగి మహిళ మృతి క్యూబా పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ యువతకు ఎంఎస్ ధోనీ కీలక సందేశం.. ముప్పై ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న మిస్టర్ కూల్ *సంగారెడ్డి పట్టణం లోని గురునానక్ మందిర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగ్గారెడ్డి భూముల పునఃసర్వేపై గ్రామసభ ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్! *సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే* తాత, తండ్రి వారసత్వం పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ 53 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్యం.. ఆ అలవాట్లతోనే నిత్యం యంగ్ లుక్ ఆత్మకూరులో మరో కీలకనేత వైసీపీ కి గుడ్ బై కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఓటేసి ఆశీర్వదించండి. అండగా ఉంటాం జలదంకి లో టిడిపి ఇంటింటి ప్రచారం

బాసర ఐఐఐటిలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
బాసర ఐఐఐటిలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి: బాసర ఐఐఐటి (ఆర్జియుకేటీ)లో విద్యార్థులకు నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.   సోమవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, బాసర ఐఐఐటి ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఐఐఐటి లో విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కలిపి పదివేల మంది వరకు ఉంటారని, వారికి తాగునీరు, రోజువారి అవసరాల నిమిత్తం  ప్రతి రోజూ దాదాపు15 లక్షల లీటర్ల వరకు నీరు కావాలని అన్నారు.  గోదావరి నది వద్ద ప్రత్యేకంగా ఐఐఐటి కోసం 60 హెచ్ పి సామర్థ్యం గల మూడు మోటార్లు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం ఒకటి పూర్తిస్థాయిలో పని చేయగా, రెండు పనిచేయడం లేదని అన్నారు. ఈ విషయం తమ దృష్టికి రాగానే రెండు మోటార్ల మరమ్మత్తుల కొరకు 8 లక్షల రూపాయలను కేటాయించినట్లు వివరించారు. ఇప్పటికే సంబంధిత సాంకేతిక నిపుణుల బృందం ఇంటెక్ వెల్ ను సందర్శించిందని తెలిపారు. పది రోజుల్లోనే రెండు మోటార్లను బాగు చేసి నీటి సరఫరాకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఒక మోటారు దాదాపు రోజుకు 25 లక్షల లీటర్లను సరఫరా చేయగలదని వివరించారు. ఈ నీరు ఐఐఐటి రోజువారీ అవసరాలకు సరిపోతుందని చెప్పారు.ఆ తర్వాత ఐఐఐటి ప్రాంగణంలోని నీటి కుంటను, పంపు  హౌస్ ను పరిశీలించారు. 
ఈ కార్యక్రమాల్లో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, గ్రిడ్ డిఈఈ, ఈఈ లు రాజేశ్వర్ రావు రాఘవేంద్ర రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపిడివో దేవేందర్ రెడ్డి, ఐఐఐటి డీన్ లు మహేష్, విఠల్, విద్యార్థి సంక్షేమ అధికారి నాగరాజు, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.