స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం
ఆరిలోవ, సూర్య : పక్షవాతం (స్ట్రోక్) లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర చికిత్స ప్రాధాన్యం, నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈనెల 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని హోటల్ గ్రాండ్ బేలో ‘స్ట్రోక్ క్విజ్ ఛాంపియన్షిప్–2026, ‘స్ట్రోక్ అవేర్నెస్ పెయింటింగ్ కాంపిటీషన్’ నిర్వహించింది. ‘ప్రతి నిమిషం విలువైనదే’ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ఆంధ్ర మెడికల్ కాలేజీ (ఏఎంసీ) మాజీ ప్రిన్సిపాల్, న్యూరాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ జి. బుజ్జి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం సీనియర్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ పూసర్ల, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం.జి.వి. ఆదిత్య, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి. సుకేష్ రెడ్డి, పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ వైద్య కళాశాలల విద్యార్థులు, మెడికల్ ఇంటర్న్లు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, జీడబ్ల్యూఎస్ ఆర్ట్ అకాడమీ ప్రతినిధులు, కేర్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు.ఆంధ్ర మెడికల్ కాలేజీ (ఏఎంసీ) మాజీ ప్రిన్సిపాల్, న్యూరాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ జి. బుజ్జి రాజు స్ట్రోక్ అవగాహన కల్పించారు.
చిన్నారుల చిత్రాల్లో స్ట్రోక్ అవగాహన జీడబ్ల్యూఎస్ ఆర్ట్ అకాడమీ సహకారంతో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంపై నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.