ఇసుక మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
మంగపేట, మేజర్ న్యూస్, ములుగు జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్‌కు వ్యతిరేకంగా పూనెం రాములు గతంలో చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీ టి ) లో దాఖలు చేసిన కేసులో స్టే ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ స్టేను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ దాఖలు చేసింది. నేడు సుప్రీంకోర్టులో సి .ఏ . నెం. 13696/2026, ఐటమ్ నంబర్ 24 గా ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా జస్టిస్ జ్యోమాల్యా బగ్చి ధర్మాసనం ఈ వ్యవహారాన్ని ఎన్ జీ టి లోనే పరిష్కరించుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చింది. పిటిషనర్ పూనెం రాములు తరపున లాయర్ పెనుబల్లి రమేష్ బాబు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్ జీ టిలో ఇచ్చిన స్టే కొనసాగనుంది. దీంతో ములుగు జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై నిషేధం కొనసాగుతుందని పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత టి ఎస్ ఎండిసి అధికారులపై ఉందని పలువురు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీం కోర్ట్ తోసిపుచ్చడంతో ప్రభుత్వానికి ఇదొక చెంప పెట్టుగా జిల్లా ప్రజలు బావిస్తున్నారు.
రిపోర్టర్; స్నేహ కుమార్, మంగపేట ములుగు జిల్లా