చేర్యాలలో 2, 3వ వార్డులకు కాంగ్రెస్ కమిటీల ఎన్నిక*
చేర్యాలలో 2, 3వ వార్డులకు కాంగ్రెస్ కమిటీల ఎన్నిక*
రెండో వార్డు అధ్యక్షుడిగా గూడ నాగశేఖర్ రెడ్డి.. మూడో వార్డు అధ్యక్షుడిగా ఎర్రమైసగల్ల గణేష్
చేర్యాల మేజర్ న్యూస్ .....
చేర్యాల: జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుపు మేరకు చేర్యాల పట్టణంలో నూతన వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఆదివారం రెండో, మూడో వార్డుల కమిటీలను పట్టణాధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రెండో వార్డు అధ్యక్షుడిగా గూడ నాగశేఖర్ రెడ్డి, మూడో వార్డు అధ్యక్షుడిగా ఎర్రమైసగల్ల గణేష్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్షుడు పుర్మ ఆగం రెడ్డి, అధికార ప్రతినిధి కాటం సంజీవయ్య, మాజీ జడ్పీటీసీలు కొమ్ము నర్సింగారావు, దాసరి కళావతి, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ ముస్త్యాల కిష్టయ్య, కాటం తేజా సంజీవయ్య, కౌన్సిలర్ ఎండీ ఖాజా, మార్కెట్ డైరెక్టర్ పచ్చిమడ్ల వెంకటయ్య, మాజీ కౌన్సిలర్లు చెవిటి లింగం, పచ్చిమడ్ల సతీష్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.గుస్క శ్రీనివాస్, మిట్టపల్లి నర్సిరెడ్డి, బుట్టి యాదగిరి, చెన్నిగారి బిక్షపతి, పచ్చిమడ్ల సత్యనారాయణ, అల్లం శ్రీనివాస్, కాటం శ్రీనివాస్, అంబాల రాము, మల్లిగారి నర్సింలు, పోలోజు ఆంజనేయులు, ఎండీ జహిరోద్దీన్, తుమ్మలపల్లి సంతోష్, బుడిగె సతీష్, శ్రీరామ్ వెంకటేష్, ఖాత శ్రీనివాస్, కోరె శ్రీశైలం, గుడాల శ్రీనివాస్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.