BREAKING
అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్ జయమ్ము నిశ్చయమ్మురా 2 షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి.. బాలకృష్ణ డైలాగ్‌తో అదుర్స్ ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం కాజిపల్లికి హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా తాగునీటి సరఫరా చేయాలి ఎర్రగూడూరులో రూ.15.60 లక్షల నగదు పట్టివేత

విద్యార్థుల భవిష్యత్తుకు సైకిళ్ల బహుమతి!

Select Suryaa Now
విద్యార్థుల భవిష్యత్తుకు సైకిళ్ల బహుమతి!

కొండాపూర్;చెర్ల గోపులారం గ్రామం నుంచి మల్లేపల్లి, తేర్పోల్ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కష్టాలను గుర్తించిన గుంతపల్లి సర్పంచ్,  పడమటి అనంత్ రెడ్డి సొంత నిధులతో సోమవారం 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. కాలినడకన పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు సమయానికి పాఠశాలలకు చేరుకుని, బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలనే లక్ష్యంతో సైకిళ్లు అందించినట్లు అనంత్  రెడ్డి తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.గతంలోనూ విద్యార్థులకు అండగా మల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసారు , గోపులారం గ్రామంలో పలుమార్లు సేవా కార్యక్రమాలు చేపట్టారని గ్రామస్తులు గుర్తుచేశారు. పేదలకు ఆర్థిక సాయం అందించడంతోపాటు, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్నవారిని పరామర్శించి ఆదుకోవడం, కరోనా సమయంలో సహాయ సహకారాలు అందించడం, శుభకార్యాలకు ఆర్థికంగా తోడ్పడటం వంటి సేవలు చేశారని కొనియాడారు.విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించడం తమ పిల్లల చదువుకు ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనంత్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ మహేశ్వరి సతీష్, ఉపసర్పంచ్ పుణ్యమ్మ రాములు, వార్డు సభ్యులు పట్నం సురేష్, నవీన్, రవి, సుజాత మాజీ సర్పంచ్ రత్నయ్య, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.