కడవెరుగులో ఇన్సూరెన్స్‌పై అవగాహన కార్యక్రమం.
కడవెరుగులో ఇన్సూరెన్స్‌పై అవగాహన కార్యక్రమం.
చేర్యాల మేజర్ న్యూస్ ..................
చేర్యాల మండలం కడవెరుగు గ్రామంలో రైతులు , గ్రామ ప్రజలకు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి అవగాహన కల్పించేందుకు మాస్ క్యాంపెయిన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆరోగ్య బీమా , వాహన బీమా యొక్క ప్రాముఖ్యత, వాటి ప్రయోజనాలు , అవసరాల గురించి రైతులకు, గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది.గ్రామ ప్రజలు, రైతులు మరియు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కడవెరుగు గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్తా, ఉపసర్పంచ్ జంగ సురేందర్, మార్కెటింగ్ మేనేజర్ జానకయ్య , మన గ్రోమోర్ చేర్యాల మేనేజర్ మధు, మన గ్రోమోర్ ఉద్యోగులు నాగరాజు పాల్గొన్నారు రైతులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..