BREAKING
ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

Select Suryaa Now
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    పోలీస్ అమరవీరుల సంస్మరన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ జంపాని కుమార్ ఆధ్వర్యంలో స్టేషన్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, ఆయుధాలు, అత్యవసర సేవలపై ఎస్‌ఐ జంపని కుమార్అవగాహన కల్పించారు.పోలీస్ అమరవీరుల దినోత్సవం (అక్టోబర్ 21)ను పురస్కరించుకొని నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్ ఆర్ పల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు ఎస్‌ఐ జంపాని కుమార్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే విధులు, పోలీస్ శాఖ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి వివరించారు. పోలీస్ శాఖలో ఉపయోగించే ఆయుధాలు, వాటి వినియోగం, భద్రతా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112కు ఫోన్ చేసినప్పుడు, అందిన సమాచారాన్ని ఎలా స్వీకరిస్తారు, సంబంధిత పోలీస్ సిబ్బందికి సమాచారం ఎలా చేరవేస్తారు, సంఘటనా స్థలానికి పోలీసులు ఎలా స్పందిస్తారు అనే అంశాలను విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా, పోలీస్ సిబ్బంది పరస్పర సమాచార మార్పిడికి ఉపయోగించే వైర్‌లెస్ సెట్స్, వాటి ప్రాముఖ్యత, పోలీస్ విధుల్లో వాటి వినియోగం గురించి తెలియజేశారు.
పోలీస్ శాఖలో కానిస్టేబుల్ స్థాయి నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ ) స్థాయి వరకు ఉన్న వివిధ హోదాలు, అధికారుల బాధ్యతలు, పోలీస్ వ్యవస్థలోని క్రమశిక్షణ, విధుల నిర్వహణ విధానం గురించి విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల దినోత్సవం అనేది దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకునే ముఖ్యమైన రోజని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ద్వారా విద్యార్థులు, యువతలో పోలీస్ శాఖ పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజలకు పోలీస్ వ్యవస్థ మరింత చేరువ కావడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
విద్యార్థులు చట్టాలను గౌరవించాలని, క్రమశిక్షణతో మెలగాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు, ప్రజల భద్రత కోసం పోలీసులు నిర్వర్తిస్తున్న బాధ్యతలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఓపెన్ హౌస్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, అత్యవసర సేవలు, సమాచార వ్యవస్థ, పోలీస్ అధికారుల హోదాలు మరియు బాధ్యతలపై అవగాహన కల్పించారు.