BREAKING
ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు -మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి – అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం

Select Suryaa Now
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు -మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి  – అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం

మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. రామాయణంలోని ఆదర్శాలు, ధర్మబద్ధమైన జీవన విధానం, నైతిక విలువలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఉన్నతమైన విలువలతో జీవించాలని సూచించారు.
మహర్షి వాల్మీకి జీవితం, రచనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని వారు తెలిపారు. ఆయన బోధించిన సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ పాండు, బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్, జిల్లా అధికారులు ఉమాపతి, కోటయ్య, సీతారాం, కుల సంఘాల నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎస్.రవీందర్ రెడ్డి,నాగర్ కర్నూల్, రూరల్ సూర్య న్యూస్.