BREAKING
సంగారెడ్డిలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు అభివృద్ధి అజండాగా రాజకీయ రంగప్రవేశం ఏకమైన జైపూర్ జర్నలిస్టులు • జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి వివేక్ హామీ వై. ఎన్. కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ *ఐజ పట్టణంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు* వార్డు మెంబర్స్ ఫోరమ్ అధ్యక్షుడిగా రాము 35వ డివిజన్‌లో ఆత్మీయ సమావేశం.. కూటమి అభ్యర్థులకు మద్దతుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్న డాక్టర్ షకీలా టీమిండియాకు బిగ్ షాక్.. మూడో టీ20కి కూడా దూరమైన స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గ్రామకంఠం భూములు కాపాడాలని ఫిర్యాదు బుచ్చిలో హోరెత్తించిన వైసిపి ఎన్నికల ప్రచారం పురోహితుడి నుంచి వెండితెరకు రవికిరణ్ శర్మ తుమాటి శశిధరరెడ్డి ప్రచారంలో బోయలచిరువెళ్ల నాయకుల మద్దతు ప్రతి మహిళా సంఘ సభ్యురాలి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలి

పొంగూరులో వాల్మీకి జయంతి వేడుకలు

Select Suryaa Now
పొంగూరులో వాల్మీకి జయంతి వేడుకలు

మర్రిపాడు మేజర్ న్యూస్:    మర్రిపాడుమండలం పొంగూరు బీసీ కాలనీలోని రామాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు నియోజకవర్గ వాల్మీకి సంఘం అధ్యక్షులు నల్లబోతుల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వాల్మీకి సంఘం వ్యవస్థపాపక అధ్యక్షులు బత్తల గోపి తోటి సంఘం నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ కులాల తెగలలో చేర్చాలని కోరుతూ గతంలో ప్రధాని నరేంద్రమోడీకి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారన్నారు. మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న వాల్మీకి బోయలు పేదరికంతో బాధపడుతున్నారని ఆనాడు లేఖ ద్వారా తెలిపారన్నారు. వాల్మీకి బోయల స్థితి గతులపై అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ కమిటీ ఆధారంగా వాల్మీకి బోయలను ఎస్టీల జాబితాలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి జిల్లా అధ్యక్షులు కామినేని శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ మండ్ల నారాయణ,నాయకులు మండ్ల శ్రీను, రమేష్, రాజీవ్ గాంధీ, మహిళలు పాల్గొన్నారు.