వై. ఎన్. కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు
నరసాపురం మేజర్ న్యూస్ శ్రీ వై. ఎన్. కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ ప్రేరణాత్మక వక్త బొడ్డపాటి చంద్రశేఖర రావు హాజరై మాట్లాడుతూ జీవితంలో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోండి. లక్ష్యం లేని పడవ ఏ తీరానికి చేరదో, లక్ష్యం లేని చదువు కూడా ఎటు వెళ్తుందో తెలియదని,
ప్రతి నిమిషం విలువైనదని, రోజులు వృధా చేసే సమయాన్ని తగ్గించుకుని, క్రమశిక్షణతో చదువుకు ప్రాధాన్యత నివ్వాలని కోరారు.
పరీక్షల్లో లేదా ప్రయత్నాల్లో ఓటమి ఎదురైతే నిరుత్సాహపడకండి. ఓటమే గెలుపునకు మొదటి మెట్టని నమ్మి,
పది మంది ఏమంటారో అని ఆలోచించకుండా, మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉండాలని, అదృష్టం ఎప్పుడో ఒకసారి కలిసి వస్తుంది, కానీ కఠినమైన శ్రమ ఎప్పటికీ వెన్నంటి ఉంటుందని అన్నారు.
చేసే పనిపై పూర్తి మనసుపెట్టండి. బ్రహ్మ ముహూర్తం లేదా ప్రశాంతమైన సమయంలో చదివితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని,
ఒంటరితనాన్ని లేదా కష్టాలను చూసి భయపడకండి, వాటిని మీ ఆయుధంగా మలుచుకుని ముందుకు సాగితే విజయం తధ్యం' అని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి శ్రీ రఘురామారావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ అందే రాo సతీష్, కోశాధికారి రెడ్డప్ప ధవేజీ, జనరల్ బాడీ సభ్యులు ఆర్. వి.సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. పి. వి. అప్పారావు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిపాల్గొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా,