BREAKING
నైతిక విలువల పెంపునకు పరివర్తన్ 28న ముత్యాలమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. ఆలయ ఓ వెంకటేశ్వర్లు అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్ జయమ్ము నిశ్చయమ్మురా 2 షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి.. బాలకృష్ణ డైలాగ్‌తో అదుర్స్ ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం

పురోహితుడి నుంచి వెండితెరకు రవికిరణ్ శర్మ

Select Suryaa Now
పురోహితుడి నుంచి వెండితెరకు రవికిరణ్ శర్మ

పామూరు, మేజర్ న్యూస్ : మంత్రోచ్ఛారణలతో శుభకార్యాలు నిర్వహించే పురోహితుడు నటనపై ఉన్న మక్కువతో వెండితెరపై తన ప్రతిభను చాటేందుకు అడుగులు వేశారు. పామూరు మండలంలోని బొట్లగూడూరుకు చెందిన పురోహితుడు కొల్లూరి రవికిరణ్ శర్మ తనలోని నటనా అభిరుచికి పదునుపెట్టి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ చిత్రాన్ని రేపు  ఉదయం 8:30 గంటలకు పామూరు పట్టణంలోని కేబీ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. మూడు రోజుల పాటు ప్రేక్షకులకు ఉచితంగా చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు రవికిరణ్ శర్మ తెలిపారు.

పురోహిత వృత్తిలో కొనసాగుతూనే నటనపై ఉన్న ఆసక్తితో చలనచిత్ర రంగం వైపు అడుగులు వేసినట్లు రవికిరణ్ శర్మ తెలిపారు. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ప్రేక్షకుల ఆదరణతో రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాల్లో నటిస్తూ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించాలన్నదే తన లక్ష్యమన్నారు.

ఈ చిత్రానికి హరికృష్ణ పమంజి దర్శకత్వం వహించగా, హీరోగా పీవీ అర్జున్, హీరోయిన్‌గా అతిథి నటించారు. పలాని స్వామి, ప్రశాంత్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే ‘లైఫ్’, ‘పలాని వాళ్ల అబ్బాయి’, ‘ఫలి’ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయని రవికిరణ్ శర్మ తెలిపారు. తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే కళారంగంలోనూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.