35వ డివిజన్‌లో ఆత్మీయ సమావేశం.. కూటమి అభ్యర్థులకు మద్దతుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ పడారుపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని స్థానిక ప్రజలను కోరారు. నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు అవసరమని అన్నారు. నెల్లూరు నగర మేయర్‌గా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌తో పాటు, 35వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మేకల మధులను అత్యధిక ఓట్లతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.