BREAKING
అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్ జయమ్ము నిశ్చయమ్మురా 2 షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి.. బాలకృష్ణ డైలాగ్‌తో అదుర్స్ ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం కాజిపల్లికి హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా తాగునీటి సరఫరా చేయాలి ఎర్రగూడూరులో రూ.15.60 లక్షల నగదు పట్టివేత

బుచ్చిలో హోరెత్తించిన వైసిపి ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
బుచ్చిలో హోరెత్తించిన వైసిపి ఎన్నికల ప్రచారం

బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్  :   మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమం హోరెత్తించింది మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ మున్సిపాలిటీ పరిధిలోని  12,13,14,15,16,17 వార్డులలో ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్ పర్సన్ అభ్యర్థితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో దారి పొడవునా అభిమానులు తమ అభిమాన నాయకులపై పూల వర్షం కురిపించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్యుడు బ్రతికే పరిస్థితులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసారని,50 ఏళ్లకే ఎస్సి, ఎస్టి, బిసి లకు పెన్షన్లు ఇస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారని అధికార పార్టీ నాయకులు ఓట్లు అడిగేందుకు తమ వద్దకు వచ్చినప్పుడు ఈ విషయమై నిలదీయండి అని మహిళలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మంచినీరు దొరకడం లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుందన్నారు. ఈ సందర్భంగా నిత్యవసర వస్తువులు, కూరగాయలను ప్రదర్శనగా ఉంచి వాటి అధిక ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. రెండు సంవత్సరాల ఏడు నెలలుగా పట్టించుకోని అధికార పార్టీనాయకులకు బుచ్చిరెడ్డిపాలెం ఎన్నికలవేళ గుర్తొచ్చిందని విమర్శించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కోరుకుంటారని, వారికి అధికారం ఇవ్వాలనే ఆశయంతో ఉంటారన్నారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం ను మునిసిపాలిటీ చేసి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రసన్నకుమార్ రెడ్డి మున్సిపాలిటీ అయ్యేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బుచ్చిరెడ్డిపాలెం కు 240 కోట్ల రూపాయల వరకు వివిధ కార్యక్రమాల కొరకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు కొంతమంది ఓట్లు అడిగేందుకు వచ్చి అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రజలు గతంలో తమకు ఐదు సంవత్సరములు అవకాశం ఇస్తే కరోనా రూపంలో రెండు సంవత్సరములు పూర్తిగా ఎలాంటి పనిచేసేందుకు వీలు లేకుండా పోయిందని అది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. మరలా తిరిగి 2029 లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు వారికి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామన్నారు. నేడు డబ్బు, అధికారం ఉందని విర్రవీగే వారికి సరైన సమాధానం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణ వైసిపి అధ్యక్షులు, ప్రస్తుత కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షాహుల్, వైసీపీ రూరల్ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.