BREAKING
వరిగుంతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉపేందర్ నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి * ఎమ్మెల్సీ సురేష్ బాబు * విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వాల్మీకి జయంతి వేడు కాలు ఘనంగా నిర్వహించారు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కీలక పరిణామాలు.. నిక్ మాడిన్సన్ స్వదేశానికి పయనం, స్టీవ్ స్మిత్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత ప్రచారంలో దూసుకు పోతున్న జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి,పందిటి అంబేద్కర్ మాదిగ రజాక్ పల్లి లో 700 ఈత మొక్కల నాటిన ఎక్సైజ్ అధికారులు… కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు- కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఎక్సైజ్ సీఐ గోపాల్ క్రెడాయ్ హోమ్ ఎక్స్‌పోకు భారీ స్పందన ఎండోమెంట్ సహాయ కమిషనర్ ను కలిసిన జిల్లా డి.డి.యన్.అర్చకులు. బాసర ఐఐఐటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం రెండు, మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభం: కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజావాణిలో 5 దరఖాస్తులు *టీడీపీ లో చేరికల జోరు వైసీపీ లో రాజీనామాల పర్వం బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిసి' రికార్డు కలెక్షన్స్.. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు నాకు దొరికిన అరుదైన అవకాశం - ఏనుగు గుర్తుకే ఓటేసి గెలిపించండి: బీఎస్పీ చైర్మన్ అభ్యర్థి గొల్ల నాగరాజు

అర్ణబ్ తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా కోనసీమ జిల్లాకు నెల్లూరు విద్యుత్ సిబ్బంది

Select Suryaa Now
అర్ణబ్ తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా కోనసీమ జిల్లాకు నెల్లూరు విద్యుత్ సిబ్బంది

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   అర్ణబ్ తుఫాను ప్రభావంపై ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో, ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ   ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన పక్షంలో తక్షణమే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్ డివిజన్ల నుంచి విద్యుత్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి బయలుదేరాయి.  తుఫాను కారణంగా విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున, ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ బృందాలను పంపించడం జరిగింది. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతులు చేపట్టి, సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఈ బృందాలు సేవలు అందించనున్నాయి.  ఈ సందర్భంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పునరుద్ధరణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ సమయంలో సిబ్బంది భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.  తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు, విద్యుత్ సరఫరా వ్యవస్థను త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏపీఎస్‌పీడీసీఎల్ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతోంది.