telangana
158 మంది విద్యార్థులకు నలుగురే ఉపాధ్యాయులు!
సూర్య, పెంచికల్‌పేట్:ఎనిమిది తరగతుల 158 మంది విద్యార్థులు.. బోధించేందుకు నలుగురు ఉపాధ్యాయులే! పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత విద్యాబోధనకు ఆటంకంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తుల తరఫున కొండపల్లికి చెందిన ఎలకరి లచ్చన్న సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో గాజుల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు.ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 158 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేక నాణ్యమైన విద్య అందడం లేదని లచ్చన్న పేర్కొన్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే అదనపు ఉపాధ్యాయులను నియమించాలని, అప్పటివరకు డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను కేటాయించి విద్యాబోధనకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు.