కళాకారులను ఆదుకోవాలి - తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి :తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లా కార్యాలయంలో తెలంగాణ కళాకారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో
జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ తెలంగాణ కళాకారులు తమ పాటలు నృత్యాల ద్వారా ఎన్నో ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలంగాణ సంస్కృతి భాష పరిరక్షణలో వారి భాగస్వామ్యం ఎంతో ఉందని కామారెడ్డి ప్రాంతంలో అనేకమంది కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ఉదృతంగా పాల్గొన్నారని
నిత్యం ప్రజలను చైతన్యవంతం చేస్తూ సమాజానికి ఆహ్లాదంతో పాటు సమస్యల పరిష్కార మార్గంలో తమ కళ ను ప్రదర్శిస్తున్నారని ఎంతోమంది కళాకారులు బీద పరిస్థితిని ఎదుర్కొంటూ కూడా తెలంగాణ కళ లను కాపాడుతున్నారని
ప్రభుత్వం తెలంగాణ కళాకారులను గుర్తించి ఆదుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా తన పాటలతో అలరిస్తున్న మద్నూర్ మండలానికి చెందిన యువ కళా కారిణి సింగర్ సంధ్య ను తెరవే ఆధ్వర్యంలో ఘనం గా సన్మానించారు.
సింగర్ సంధ్య ఎన్నో పాటలను పాడుతూ ఎన్నో అవార్డులను బహుమతులను గెలుచుకున్నదని అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నదని అనేక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నదని భాష సంస్కృతి పరిరక్షణ గీతాలతో అందరి మెప్పును పొందుతు న్నదని మరెన్నో అద్భుత విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సింగర్ సంధ్య మాట్లాడుతూ మరిన్ని పాటలు పాడి కామారెడ్డి ప్రాంతానికి మంచి పేరును తీసుకొస్తానని తెరవే ఆధ్వర్యంలో సన్మానించడం చాలా గర్వంగా ఉంది అని
అన్నారు.ఈ కార్యక్రమంలో తెరవే జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం తిరుమల తిరుపతిరావు లతో పాటు
ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.