BREAKING
పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు - అడిషనల్ ఎలక్షన్ అథారిటీ వై.ఓ నందన్ గ్లోబల్ మార్కెట్ల సాంకేతిక విశ్లేషణ...ట్రెండింగ్ గ్రాఫిక్స్ మరియు వాణిజ్య సరళి కొమురం భీమ్ ఆశయాలను సాధించాలి ఈజీజెట్ విమానాల్లో స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు "సర్వేపల్లి లో వై కా పా లోకి వరస చేరికలతో చతికిలపడ్డ టి డి పి " సూర్యని పొగడ్తల్లో ముంచెత్తిన నటి నజ్రియా నాజిమ్ కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* లాభాల బాటలో లండన్ మార్కెట్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ ఆధ్యాత్మిక శోభతో సత్యనారాయణ స్వామి ఆలయం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు కార్పొరేట్ రుణాల ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...డాయిష్ బ్యాంక్ కీలక అడుగు 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన నాయకుల విస్తృత ప్రచారం! అర్నబ్' ముప్పుపై యంత్రాంగం అప్రమత్తం ఫెడెక్స్ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జమేర్ జాక్సన్ నియామకం ఖేత్ బచావో అభియాన్‌లో రైతులకు అవగాహన

ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్ల దందా!?

Select Suryaa Now
ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్ల దందా!?

మంగపేట, మేజర్ న్యూస్, అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖలోని కొందరు సిబ్బందే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ములుగు జిల్లా మంగపేట మండలంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మండలంలోని బెల్ట్ షాపుల వద్ద ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. వాటిని అదుపు చేయాల్సిన ఎక్సైజ్ శాఖకు చెందిన ఒక కానిస్టేబుల్, దసరా పండుగ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు మామూళ్లు ఇవ్వాలంటూ బెల్ట్ షాపుల నిర్వాహకులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు బెల్ట్ షాపుల నిర్వాహకులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఒక్కో బెల్ట్ షాపు నుంచి సుమారు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవ్వని వారి షాపులపై కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వసూళ్ల వ్యవహారంపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని, సంబంధిత కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

రిపోర్టర్:, స్నేహకుమార్, మంగపేట, ములుగు జిల్లా