పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు - అడిషనల్ ఎలక్షన్ అథారిటీ వై.ఓ నందన్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ / అడిషనల్ ఎలక్షన్ అథారిటీ వై.ఓ నందన్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 27, 28 వ తేదీలైన మంగళ, బుధవారాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు బృందాల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించనున్నామని తెలిపారు. ఎలక్షన్ విధులు నిర్వహిస్తున్న నెల్లూరు నగర పాలక సంస్థ, ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఓటరు గుర్తింపు కార్డు,ఆధార్ కార్డు, ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించిన డ్యూటీ ఆర్డర్ కాపీతో పోస్టల్ బ్యాలెట్ సెంటర్ కు హాజరుకావాలని సూచించారు.