BREAKING
రామాయణం సినిమాలోని మంగళ్ రంగ్ సాంగ్‌పై నెట్టింట దుమారం.. ఏఆర్ రెహమాన్ సూఫీ సంగీతంపై వ్యతిరేకత ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం *అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం* *ఏలూరు సర్కిల్, జంగారెడ్డిగూడెం డివిజన్లలో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి వేడుకలు బాసర ఐఐఐటిలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఇసుక మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం ​ఆర్డీవో ఎలీషా బాబుకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి రాష్ట్ర ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల ప్రోత్సాహం – యువతకు ఉపాధి అవకాశాల కల్పన : రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డా. వై. యువరాజ్ గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కొమురం భీమ్‌ - మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ నా భార్య జ్యోతిక వల్లే ఈ స్థాయిలో ఉన్నాను: దుబాయ్ వేదికగా స్టార్ హీరో సూర్య భావోద్వేగ వ్యాఖ్యలు మరణంలోనూ మరో ఇద్దరికి చూపునిచ్చిన శేషరత్నం మహర్షి వాల్మీకి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. లయన్ నటరాజన్ కు మాతృవియోగం-నేత్రదానం చేసిన అంబటి గౌరమ్మ

మచ్చ --హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం : డా. కె.వి. కృష్ణారావు

Select Suryaa Now
మచ్చ  --హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం : డా. కె.వి. కృష్ణారావు

---ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ

--హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం : డా. కె.వి. కృష్ణారావు

ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని ఉద్యమకారులను హౌస్ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డా. కె.వి. కృష్ణారావు పేర్కొన్నారు . ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు . ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఈ నెల 26వ తేదీలోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ డిమాండ్ పిలుపు మేరకు సీఎం ఇంటి ముట్టడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద ఉద్యమకారులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు , అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు . తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే వేగవంతం చేసి , పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు . ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు , ధర్నాలు , ఆందోళనలు చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో పగడాల నరేందర్ , లింగానబోయిన సతీష్ , డోకుపర్తి సుబ్బారావు , రెడ్డబోయిన వరలక్ష్మి , కామని అనంత లక్మి , స్వరూప రెడ్డి , కమలమ్మ , ధన లక్మీ , యాక  లక్ష్మీ తదితరులు ఉన్నారు .