BREAKING
ఎంపీటీసీ ఎన్నికల బరిలో 44 మంది అభ్యర్థులు గుండారెడ్డిపల్లిలో ఎల్‌ నినో ప్రభావంపై గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్ పిల్లి బాబు స్థానిక ఎన్నికల నామినేషన్లపై ఏపీ హైకోర్టులో పిటిషన్: ప్రతివాదులకు నోటీసులు, విచారణ శుక్రవారానికి వాయిదా ఓవర్సీస్‌ బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డు వసూళ్లు.. విజయ్ దేవరకొండ సంచలనం జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు బెల్ట్ షాపుల నిర్వహణపై సర్పంచ్ ల ఆగ్రహం.... భట్టిప్రోలు మండలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు బాలల భద్రతకు ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’.. పోక్సో చట్టం, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌పై 1,650 మందికి పైగా విద్యార్థులకు న్యాయమూర్తుల అవగాహన " అక్రమ కేసులతో అరెస్టులను ఖండిస్తున్నాం - కాకాణి" వి బి జి రామ్ పనులపై శిక్షణ...... అబుదాబిలో ఒకే వేదికపై విజయ్ దేవరకొండ, శిఖర్ ధావన్.. వైరలవుతున్న పిక్స్ రుణం తీర్చుకుంటా అవకాశం కల్పించండి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ అనిరుధ్, కావ్య మారన్ చెన్నై రిసెప్షన్ ఇన్విటేషన్ వైరల్.. ఆ ఒక్క టాలీవుడ్ హీరో ఎవరంటే ఆర్ వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు ‘స్వేచ్ఛ రథం’.. వెట్టిచాకిరీ రహిత జిల్లాగా మేడ్చల్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం

పెండింగ్‌ ఎస్‌ఐఆర్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌.

Select Suryaa Now
పెండింగ్‌ ఎస్‌ఐఆర్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌.

సంగారెడ్డి, :-- ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ  ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, అర్హత కలిగిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతి, ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్‌ పనులపై సమీక్షించారు.కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, అదనపు కలెక్టర్లు టి.ఎల్‌. సంగీత, ఆర్‌. పాండు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ, ఫారం-6, 7, 8 దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో తప్పుగా మ్యాపింగ్‌ అయిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హతలను నిర్ధారించాలన్నారు.అనర్హులుగా గుర్తించిన ఓటర్ల విషయంలో అనర్హతకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయడంతో పాటు, అందుకు సంబంధించిన ఆధారాలు, పూర్తి వివరాలను రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు.  అనర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాలను మరోసారి క్షుణ్ణంగా పునఃపరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల అమలు, ఖచ్చితత్వానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు.