మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
???? సాగునీటి కోసం ఎమ్మెల్యే కృషిపై హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు
మునుగోడు,మేజర్ న్యూస్:
మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో శివన్నగూడెం రిజర్వాయర్‌కు ఏదుల నుంచి నీటిని తరలించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించి, ప్రత్యేక చొరవ చూపిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రగతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
శివన్నగూడెం రిజర్వాయర్‌కు ఏదుల నుంచి నీటిని తరలించే విషయంలో ఎమ్మెల్యే చూపిన చొరవ మునుగోడు, దేవరకొండ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం, సాగునీటి సమస్యల పరిష్కారం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటి తరలింపు ప్రక్రియ విజయవంతమై రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.